NGKL: సర్పంచ్ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-765)పై పోలీసులు బుధవారం రాత్రి పటిష్ట వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.