W.G: తణుకులోని సొసైటీ రోడ్డులో ఓ షాపు ఆవరణలో బుధవారం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడిని విజయవాడ రూరల్ పెనమలూరుకు చెందిన కొమ్మగిరి ఆదాంగా గుర్తించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.