VSP: గోపాలపట్నం సాప్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి గ్రాడేయేట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడలలో ప్రతిభ చూపించిన వారికి డిసెంబరు 1, 2 తేదీలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు పంపనున్నట్లు పేర్కొన్నారు. కావున క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.