GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్రమణలను శుక్రవారం నుంచి తొలగిస్తామని సీఐ సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే చెంచుపేట ప్రాంతంలో రహదారి మీద వరకు ఉన్న ఆక్రమణలను గుర్తించి వ్యాపారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గురువారం మారీసుపేటలో పర్యటించి ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న రోడ్డు పక్కన గల షాపులను తొలగించాలని వ్యాపారస్తులకు చెప్పారు.