GNTR: తుళ్లూరు (M) శాఖమూరులో ఓ నిర్మాణ కంపెనీకి చెందిన వాహనం ఢీకొని వృద్ధుడు మృతి ఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. నిర్మాణ సంస్థ ట్రాన్స్పోర్ట్ కారు డ్రైవర్ పక్కన కూర్చొని వేరొక వ్యక్తికి డ్రైవింగ్ సీటు ఇవ్వడంతో వాహనం సుందరరావు అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.