AP: రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నడుంబిగించింది. 2 దశల్లో రూ.260 కోట్లతో చేపట్టే పనులకు CM చంద్రబాబు ఇవాళ 10:30AMకు భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే తొలి విడత పనులు పూర్తికాగా.. 2, 3 విడతల పనులు చేపట్టనున్నారు.