W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించారన్న రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.