KDP: మైదుకూరు పట్టణంలోని మూలబాట అంగన్వాడి కేంద్రం వద్ద రాత్రికి రాత్రే వెలిసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న 14వ వార్డు మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో బుధవారం అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో, మున్సిపల్ అధికారులు వెనుతిరుగారు.