TG: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద NH-167పై ఘోర ప్రమాదం జరిగింది. ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్ పూర్తిగా దగ్ధమవ్వగా.. లారీ డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అగ్నికీలలు ఎగిసిపడటంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.