మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి రామచంద్ర రాజుతో కలిసి మీడియా సెంటర్ను జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పత్రికలలో ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందన్నారు.