GDL: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా గ్రామ పంచాయతీలలోని వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు, పార్టీ గుర్తులకు ముసుగులు తొడగాలని కలెక్టర్ సంతోష్ అధికారులను బుధవారం ఆదేశించారు. పోలింగ్‌కు 48 గంటల ముందుగానే ప్రచారం ముగించే విధంగా అభ్యర్థులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.