HYD: సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోగా, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.