ADB: భీంపూర్ మండలంలో పొగ మంచు కమ్మేసింది. మండలంలోని అర్లిటి గ్రామాన్ని గురువారం ఉదయం పొగ పూర్తిగా కమ్మేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేనంతగా ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడ చలి తీవ్రత ఎంత అనేది తెలియ రాలేదు. వాతావరణం మార్పులను సూచించే వెధర్ మిషిన్ చెడిపోయిందని గత 6 నెలలుగా పట్టించుకునే వారే లేరని అధికారులు తెలిపారు.