NLR: బుచ్చిరెడ్డిపాళెం-రాజుపాలెం రోడ్డు గుంతల మయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో బుచ్చి నుంచి ఊటుకూరు వరకు బీటి రోడ్డు నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరితగతిన టెండర్లు నిర్వహించి రోడ్డు పనులు ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు.