PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని తాడికొండ PHC వైద్య సిబ్బంది బుధవారం గుమ్మలక్ష్మీపురం TDP క్యాంప్ కార్యాలయంలో కలసి సమావేశం భవనం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రి పరిధిలో 214 మంది సిబ్బంది ఉన్నారని, నెలలో రెండుసార్లు సమావేశాలు జరుగుతున్నాయని, అయితే సమావేశ భవనం లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు.