ఒడిశా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సభలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు. 29 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 2025-26 సంవత్సరానికి అదనపు బడ్జెట్ పద్దులను సీఎం మోహన్ సమర్పించనున్నారు. మరో వైపు మోహన్ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అంతే ధీటుగా వారిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం రెడీగా ఉంది.