వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎనమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని అరేపల్లి గ్రామంలోని తాటికొండ బ్రహ్మచారి వుడ్ వర్క్ షాప్ వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,040 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.