E.G: గోకవరంలో బుధవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకైన వంతెన కారణంగా ఆంజనేయ స్వామి గుడి సెంటర్ నుంచి తానా సెంటర్ వరకు పలు వాహనాలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణమైన ఇరుకు వంతెనను తొలగించి, దాని స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులతో పాటు వాహనదారులు, సంబంధిత అధికారులను కోరుతున్నారు.