‘రివాల్వర్ రీటా’గా ఈ శుక్రవారం కీర్తి సురేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ ఇప్పుడే మొదలైనట్లు అనిపిస్తోందని, విభిన్న పాత్రలే తన బలమని చెప్పారు. ఇదే సమయంలో.. ‘బలగం’ వేణు దర్శకత్వంలో వస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియా రూమర్లకు చెక్ పడింది.