విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులను బుధవారం విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష పడిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.