ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఉదయం గంటసేపు వాకింగ్‌కు వెళ్తే.. నాకు శ్వాస తీసుకోవడం కష్టమైంది’ అని ఆయన స్వయంగా వెల్లడించారు. కాలుష్యం దృష్ట్యా 60 ఏళ్లు పైబడిన వారికి వర్చువల్ విచారణకు అనుమతించాలని లాయర్లు కోరగా.. బార్ అసోసియేషన్ అంగీకరిస్తే సుప్రీంకోర్టును పూర్తిగా వర్చువల్ మోడ్‌లోకి మారుస్తామని సీజేఐ తెలిపారు.