KMR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం KMR కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో డీపీఆర్వో తిరుమల ఉన్నారు.