అన్నమయ్య: కె. వి. పల్లి మండలం కుప్పం వారి పల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మారేళ్ల నుంచి పీలేరు వైపు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.