VSP: విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు నీటి చార్జీల బకాయిలు కోట్ల రూపాయలలో ఉన్నందున వాటి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీ ఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నవంబర్ 30వ తేదీలోగా పన్నుల వసూళ్లను పూర్తి చేయాలన్నారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.