HYD: లూలూ హైపర్ మార్కెట్లో ‘బ్యూటీ ఫెస్ట్-2025’ ప్రారంభమైంది. మిస్ సుప్రానేషనల్ ఏషియా-2023 ప్రజ్ఞా అయ్యగారి ముఖ్య అతిథిగా పాల్గొని, హైపర్ మార్కెట్ డీజీఎం విశాల్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిరకాల బ్యూటీ ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. ఈ ఫెస్ట్ నేటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు జరగనుంది.