MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు.