దేశవాళీ T20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-C గ్రూపులో భాగంగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. ఉర్విల్ 31 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. 12.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 183 పరుగుల చేసి విజయం సాధించింది.