WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన ఘటనలో ఇన్స్పెక్టర్తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల మామూనూరు పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్‌కు బదిలీ అయిన సీఐ రమేష్‌తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీచేశారు. వీరిపై అవినీతి ఆరోపణలు రాగా విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.