W.G: నరసాపురం నుంచి సేకరించిన చెత్తను తమ గ్రామంలో వేయవద్దంటూ రుస్తుంబాద గ్రామస్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని మండవారి గరువు వద్ద ఖాళీ స్థలంలో చెత్త వేసేందుకు వచ్చిన లారీని ప్రజలు అడ్డుకున్నారు. నివాసిత ప్రాంతాల సమీపంలో చెత్త వేయడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోయారు. దీంతో చెత్త లారీ వెనుదిరిగింది.