KRNL: ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ ఏ. సిరి ప్రశంసించారు. ఇవాళ పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు. 70సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగుచేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు వివరించారు.