PPM: మెరుగైన ఆరోగ్య అంశాలపై విద్యార్థి దశ నుండే అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం అధికారి డా.టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. సీతానగరం జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ మేరకు విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఎంత మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారని అడిగారు.