మెదక్: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.