KMR: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి కలెక్టరేట్లో బుధవారం జిల్లా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు.