KDP: లింగాలకు చెందిన మాజీ సర్పంచ్ అలవలపాటి మహేశ్వర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇందులో అవినాష్ రెడ్డి పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.