MHBD: కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు పోలీస్ స్టేషన్లను బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసులు ఇతర వివరాలపై ఆరా తీశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని, పోలీస్ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.