VZM: రాజ్యాంగం సార్వభౌమ, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం, అలాగే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం భవిత అన్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కోర్ట్లో న్యాయశాఖ సిబ్బంది అందరి చేత రాజ్యాంగ పీఠికను చదివించి, ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలు పౌర హక్కులు బాధ్యతలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యమన్నారు.