KDP: ఒంటిమిట్ట మండలంలోని పెద్ద కొత్తపల్లె గ్రామంలో అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు బండలాగుడు పోటీలను నిర్వహించారు. వీటిని రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.