GDWL: రాజ్యాంగంలోని మౌలిక అవగాహన ప్రతి ఒక్క విద్యార్థి తప్పక కలిగి ఉండాలని గద్వాల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి డి. ఉదయ నాయక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.