SKLM: ఇచ్చాపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 29 కిలోల నిషేధిత గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నం నాయుడు తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.