BHPL: మల్హర్రావు మండలంలో మానేరు నది నుంచి వల్లెంకుంట వరకు ఉన్న మంచినీటి పైప్లైన్లో లీకేజీలు ఏర్పడి నీరు రోడ్డుపైకి వచ్చి వృథా అవుతోంది. దీంతో మట్టి రోడ్డు పూర్తిగా బురదగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడవడం కుదరకపోగా, వ్యవసాయ పనులకు వెళ్లే ట్రాక్టర్లు బురదలో కూరుకుపోతున్నాయి. లీకేజీలు వెంటనే రిపేర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.