W.G: జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పాలకొల్లు సమీపంలోని పూలపల్లిలో ఉన్న రంగరాజు రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రైస్ మిల్ యజమానులను ఆదేశించారు. ధాన్యంతో వచ్చిన వాహనాలను వెంటనే దిగుమతి చేసి పంపివేయాలని సూచించారు.