HYD: ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది. నగరంలో పునరుద్ధరించిన పలు చెరువులను కర్ణాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం ఇవాళ సందర్శించింది. అనంతరం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథన్‌ను కలిశారు. చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకున్నారు.