W.G: చరిత్రను మరిచిపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం భీమవరంలో జరిగిన జాతీయ రాజ్యాంగ దినోత్సవ న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డా. బి.ఆర్. అంబేద్కర్ గురించి వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శించేవారు ఆయన జీవిత చరిత్రను చదివి తెలుసుకోవాలని సూచించారు.