కోనసీమ: రాజోలు పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శివకోడు హెలిప్యాడ్‌కు చేరుకోగా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆయనను ప్రత్యేకంగా పలకరించారు. ఈ సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి త్వరలో వస్తానని పవన్ తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.