ASF: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచేశారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలన్నారు.