AKP: మాక్ అసెంబ్లీలో పాల్గొన్న నక్కపల్లి మండలానికి చెందిన విద్యార్థిని స్నేహలతను హోం మంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే రాజ్యాంగం, అసెంబ్లీ, పార్లమెంట్ తదితర విషయాలపై అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్తులో స్నేహలత మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.