MDK: తూప్రాన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మాక్ అసెంబ్లీ నిర్వహించినట్లు హెచ్ఎం ఫ్లోరెన్స్ తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం గురించి వివరించి, ఉపాధ్యాయులు విజయ కుమారి మార్గదర్శనం చేస్తూ మాక్ అసెంబ్లీని చేపట్టారు. విద్యారంగం, క్రీడలు, రోడ్డు ప్రమాదాలపై చర్చ రసవత్తరంగా సాగినట్లు వివరించారు.