KRNL: గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో భాగంగా కోడుమూరు MLA దస్తగిరి ఇవాళ పర్యటించారు. లబ్ధిపొందిన రైతుల ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, రైతులకు కలిగిన లబ్ది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.