MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్ పల్లి పి.మల్లేశం దక్కించుకున్నట్లు వారు తెలిపారు.