నటుడు విజయ్ రామరాజు నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మరో OTTలోకి రాబోతుంది. ఈటీవీ విన్లో రేపటి నుంచి అందుబాటులో ఉండనుంది. అలాగే విష్ణు విశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.